తైపీ (చైనీస్ తైపీ) : తైపీ ఓపెన్ సూపర్ 300 టోర్నీలో భారత పోరాటానికి తెరపడింది. క్వార్టర్‌ఫైనల్స్‌కు ముందే భారత షట్లర్లు ఇంటిముఖం పట్టగా.. క్వార్టర్స్‌లో స్టార్ ఆటగాడు హెచ్.ఎస్ ప్రణయ్ పోరాటం ముగించాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో ఐదో సీడ్, హాంగ్‌కాంగ్ ఆటగాడు లాంగ్ ఆంగాస్ 21-19, 21-8తో ప్రణరుపై విజయం సాధించాడు. 38 నిమిషాల్లోనే ముగిసిన మ్యాచ్‌లో మూడో సీడ్ ప్రణరు ఆశించిన ప్రదర్శన కనబరచలేదు. తొలి గేమ్ నువ్వా నేనా అన్నట్టు సాగగా.. 11-9తో విరామ సమయానికి హెచ్.ఎస్ ప్రణరు ఆధిక్యంలో నిలిచాడు. ద్వితీయార్థంలో ప్రతి పాయింట్ ఆధిక్యం మారుతూ సాగింది. 12-12తో స్కోరు సమం చేసిన ఆంగాస్.. ప్రణయ్ని వెంబడించాడు. 19-19 వద్ద ప్రణయ్ని వెనక్కి నెట్టి హాంగ్‌కాంగ్ షట్లర్ పైచేయి సాధించాడు. ఇక రెండో గేమ్‌లో ప్రణరు చేతులెత్తేశాడు. ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయాడు. 11-6తో విరామ సమయానికి ముందంజలో నిలిచిన ఆంగస్.. 21-8తో రెండో గేమ్‌ను, సెమీఫైనల్స్ బెర్త్‌ను సొంతం చేసుకున్నాడు.