
నవతెలంగాణ -కమ్మర్ పల్లి
తను విసిరిన సవాలును మంత్రి ప్రశాంత్ రెడ్డి స్వీకరించలేక తోక ముడిచారని కర్ణాటక ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ అన్నారు. తాను విసిరిన సవాలు ప్రకారం బుధవారం ఆయన వేల్పూర్ లోని అంబేద్కర్ చౌరస్తాకు చేరుకొని ప్రశాంత్ రెడ్డిని అక్కడికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ప్రశాంత్ రెడ్డి అక్కడికి రాక తోక ముడిచారని ఎమ్మెల్యే తెలిపారు.ఇప్పటికైనా ప్రశాంత్ రెడ్డి అసత్య ఆరోపణలు మానుకొని బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.అభివృద్ధి పేరు మీద ఓటు అడిగే దమ్ము కేసిఆర్ ప్రశాంత్ రెడ్డిలకు లేదని కర్ణాటక మీద పడి ఏడుస్తున్నారని విమర్శించారు.ప్రశాంత్ రెడ్డి ని బాల్కొండ ప్రజలు డిపాజిట్లు రాకుండా ఓడించాలని కోరారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, బాల్కొండ నియోజకవర్గంలో ముత్యాల సునీల్ కుమార్ బంపర్ మెజారిటీతో గెలుస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.