
నవతెలంగాణ -డిచ్ పల్లి
ఇందల్ వాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశా కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మండల ఆరోగ్య విస్తరణ అధికారి వై శంకర్ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలకు రక్తహీనత లేకుండా చూడాలని గర్భిణీ స్త్రీలకు కచ్చితంగా నూట ఎనబై ఐరన్ ఫోలిక్ యాసిడ్ మాత్రలు వేయాలని 180 క్యాల్షియం మాత్రలు వేయాలని తెలిపారు గర్భిణీ స్త్రీలందరూ పౌష్టిక ఆహారం తీసుకునేలా చూడాలని వారికి రక్తహీనత కలగకుండా బెల్లం పట్టిలు, మునగ ఆకు ,క్యారెట్, ఆకు కూరలు తినాలని సూచించాలని అవగాహన కల్పించాలని తెలిపారు. కౌమారదశలో గల బాలికలకు రక్తహీనత లేకుండా చూడాలని వారికి దాని ఆవశ్యకతను వివరించాలని తెలిపారు. కళ్ళ కలక అంటువ్యాధి గురించి ఇంటింటికి తిరిగి ప్రజలలో పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని వివరించారు. తల్లిపాల వారోత్సవాల ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు ఎం. ఎల్. ఎచ్. పి.ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.