ప్రేమ్‌ చందర్‌ రెడ్డిని అరెస్టు చేయాలి

నవతెలంగాణ- సంస్థాన్‌నారాయణపురం
గుత్తా ప్రేమ్‌ చందర్‌ రెడ్డి తన భార్య ఎంపీపీ పదవిని అడ్డం పెట్టుకుని అంగడి స్థలాన్ని కబ్జా పెట్టినందుకు అరెస్టు చేయాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు. గురువారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ప్రజలకు చెందాల్సిన ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమాలు చేస్తే గత సంవత్సరం అప్పటి ఎస్‌ఐ యుగంధర్‌ తో కుమ్మక్కై తమపైన అక్రమ కేసులు బనాయించినట్టు పేర్కొన్నారు. ఆ కేసుకు సంబంధించి నేడు కోర్టుకు హాజరుకావాలని తమకు సమన్లు పంపించినట్టు తెలిపారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు మందుగుల బాలకష్ణ,సూరపెళ్లి శివాజీ,చిలువేరు అంజయ్య,వలిగొండ యాదగిరి,రమేష్‌,యాదగిరిబాబు తదితరులు పాల్గొన్నారు.