క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ నియామకాలు

నవతెలంగాణ- ఆర్మూర్: మండలంలోని చే పూర్ గ్రామ శివారు క్షత్రియ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, డిఎస్ టెక్నాలజీన్ నిజామాబాద్ వారు శుక్రవారం ప్రాంగాణ నియామకాలు నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో చివరి సంవత్సరం చదువుతున్నటువంటి మేనేజ్మెంట్, ఇంజనీరింగ్ కు సంబంధించిన 100 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగినది. దినిలో భాగంగా విద్యార్థులను ఎంపిక చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో డిఎస్ టెక్నాలజీకి చెందిన డైరెక్టర్, వారి కంపెనీకి చెందిన హెచ్ఆర్  మిగతా సభ్యులు పాల్గొని విద్యార్థుల యొక్క నైపుణ్యాలను గుర్తించి వారి కంపెనీకి ఎంపిక చేసుకోవడం జరిగినది. దీనికిగాను కళాశాల యజమాన్యం, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ ఎంపికైన విద్యార్థులను అభినందించడం జరిగినది.