భారత దేశానికి గర్వకారణం

– ఎనిమిది గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సాధించిన శివనారాయణ్‌ జ్యువెలర్స్‌
నవతెలంగాణ-హైదరాబాద్‌
నగరంలోని అగ్రశ్రేణి వారసత్వ ఆభరణాల సంస్థ శివ నారాయణ్‌ జ్యువెలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎనిమిది గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ టైటిల్స్‌ సాధించింది. చరిత్రలో ఇటువంటి ఘనతను సాధించిన మొదటి భారతీయ ఆభరణాల వ్యాపార సంస్థగా నిలిచింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, ప్రముఖులు, సెలబ్రెటీలు హాజరు కాగా, భారీ వేడుకను చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలిచే, శివనారాయణ మహౌన్నత వారసత్వాన్ని ప్రశంసించా డానికి సరైన వేదికగా ప్రతిబింబించే తాజ్‌ ఫలక్‌ నుమా ప్యాలెస్‌లో నిర్వహిం చారు. ఈ వేడుకలో బాలీవుడ్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌ దిశా పటానీ, శివనారాయణ్‌ అత్యున్నత ఆభరణాలను ధరించి ర్యాంపై పై ప్రదర్శించారు. దివినుంచి భువికి వచ్చిన దేవకన్యలా ఆమె ర్యాంప్‌ పై నడిచి వస్తుంటే, ఆభరణాలు సంక్లిష్టత మాత్రమే కాకుండా హస్తకళ నైపుణ్యం, వాటి గాంభీర్యత సైతం అంతే గొప్పగా ప్రదర్శితమయ్యాయి. ఈ కార్యక్రమంలో మరో ఆకర్షణీయ మైన అంశంగా అపూర్వమైన ఎక్స్పీరియన్షియల్‌ జోన్‌ నిలిచింది. ఈ ప్రతిష్టాత్మక విజయం పట్ల సంస్థ ఎండీ తుషార్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ ఆనందం వ్యక్తం చేశారు.ఎనిమిది గిన్నిస్‌ వరల్డ్‌ సాధించటం పట్ల ఉద్యోగుల కృషి కూడా ఉందన్నారు.