ప్రాథమిక స్థాయి పాఠశాల సముదాయ సమావేశం

నవతెలంగాణ- కమ్మర్ పల్లి:
 మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల పాఠశాల సముదాయ సమావేశం నిర్వహించారు. ప్రాథమిక స్థాయిలో ఎఫ్ ఎల్ ఎన్ తొలిమెట్టు కార్యక్రమం, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో అమలవుతున్న ఉన్నతి, లక్ష కార్యక్రమాలు  నిర్వహణ గురించి, తరగతి గదిలో అమలవుతున్న తీరు, సమర్థవంతంగా బోధన అభ్యసన ప్రక్రియలు  నిర్వహణకు గాను చేపట్టాల్సిన చర్యలను సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా  కమ్మర్ పెళ్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు పసుపుల సాయన్న మాట్లాడుతూ వైయక్తిక  కృత్యాధార బోధన చేయాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ కార్యదర్శి బాల్ రాజ్, రిసోర్స్ పర్సన్లు  చంద్రశేఖర్, హిమాముద్దీన్,  ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.