వివిధ రాజకీయ పార్టీల నాయకుల ముందస్తు బైండోవర్

నవ తెలంగాణ-జక్రాన్ పల్లి :

మండలంలోని పలు గ్రామాలలో రాజకీయ నాయకుల ను జక్రాన్ పల్లి పోలీసులు తాసిల్దార్ ముందు ముందస్తు బైండోవర్ చేశారు. గత ఎలక్షన్లలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు ఎలక్షన్ కు విరుద్ధంగా ఎన్నికల కోడ్ను అతిక్రమించిన వారిని తాసిల్దార్ ముందు పోలీసులు బైండోవర్ చేశారు. మళ్లీ ఆరు నెలల వరకు తిరిగి ఎటువంటి తప్పులు ఎలక్షన్ కోడ్ను విస్మ హరించరాదని తాసిల్దార్ కలీం తెలిపారు. ఎలక్షన్ కోడ్ ను విస్మరిస్తే రెండు లక్షల జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు