నాణ్యమైన పాల ఉత్పత్తికి ప్రాధాన్యతనివ్వాలి

– రైతులతో మాట్లాడుతున్న ఎండి ,పాల్గొన్న కలెక్టర్
– నాణ్యమైన పాల ఉత్పత్తికి ప్రాధాన్యత నివ్వాలి
– రాష్ట్ర విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మి
నవ తెలంగాణ – తాడ్వాయి
నాణ్యమైన పాల ఉత్పత్తికి అధిక ప్రాధాన్యత నివ్వాలని తెలంగాణ రాష్ట్ర విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్ చిట్టెం లక్ష్మి తెలిపారు. తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ గ్రామంలోని పాల శీతలీకరణ కేంద్రాన్ని ఆమె పరిశీలించారు. అనంతరం కరడ్పల్లి గ్రామంలోని పాల కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పాల ఉత్పత్తిలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తేనే పాలకు మంచి గిట్టుబాటు ధర లభిస్తుందని తెలిపారు. రైతులు పాల ఉత్పత్తి పెంచడంలో కృషి చేయాలన్నారు. కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ..రైతులు పాల ఉత్పత్తిని తమ సొంత వృత్తిగా భావించాలని సూచించారు. పాల ఉత్పత్తితో అధిక ఆదాయం పొందవచ్చని తెలిపారు  వ్యవసాయంతో పాటు పాల ఉత్పత్తిని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బి ఎం సి యు అధ్యక్షులు బద్దం నరసింహారెడ్డి, డైరెక్టర్లు కిష్టా రెడ్డి ,బిఎంసియు మేనేజర్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.