ప్రయివేట్‌ పాఠశాలలు కచ్ఛితమైన నిబంధనలు పాటించాలి

– వికారాబాద్‌ జిల్లా విద్యాధికారి జి. రేణుకాదేవి
నవతెలంగాణ-వికారాబాద్‌ కలెక్టరేట్‌
ప్రయివేట్‌ పాఠశాలలు కచ్చితమైన నిబంధనలు పాటించాలని వికారాబాద్‌ జిల్లా విద్యాధికారి జి. రేణుకా దేవి ఆదేశించారు. గురువారం కలెక్టరే ట్‌లో ప్రయివేట్‌ పాఠశాలల యాజమాన్యం, ప్రిన్సిపా ల్స్‌తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్ర తీ పాఠశాల తప్పనిసరిగా యాజమాన్య బోర్డు, గవర్నింగ్‌ బాడీని నియమించుకోవాలన్నారు. ఇట్టి బోర్డు సభ్యులు తప్పనిసరిగా నెలవారి సమావేశాలు నిర్వ హించుకోవాల న్నారు. అదే విధంగా విధిగా తల్లిదండ్రు లతో ప్రతినెలా తప్పనిసరిగా సమీక్షా సమావేశాలు నిర్వహించాలని సూ చించారు. భద్రతా, ఆరోగ్య, పరిశుభ్రతా కమిటీల ఆధ్వ ర్యంలో విద్యార్థులకు మాదక ద్రవ్యాల దుర్వినియోగం, సరియైన విధంగా ఇంటర్‌నెట్‌ వాడకంపై అవగాహన కల్గించాలన్నారు. పాఠశాలల్లో తప్పనిసరిగా ప్రభుత్వ నిబంధనలు పాటించాలని సూచించారు. పాఠ శాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పావని హెచ్చరించా రు. జూలై 1వ తేదీ నుంచి 31వరకు పఠనోత్సవ కార్యక్ర మాలు నిర్వహించాలని తెలిపారు. ఇందులో భాగంగా 10వ తేదీ నుంచి 15వ తేదీ వరకు గ్రంథాలయ వారో త్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. ఈ సమావే శంలో ట్రస్మా రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యులు ఎం.నాగయ్య, జిల్లా అధ్యక్షులు ఎన్‌.వెంకట్‌రెడ్డి, కార్యదర్శి ప్రశాంత్‌, కోశాధికారి ప్రకాష్‌, పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్‌, కార్యదర్శి బస్వరాజ్‌ పాల్గొన్నారు.