నవతెలంగాణ-భిక్కనూర్
గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర జేఏసీ కమిటీ పిలుపుమేరకు నేటి నుండి సమ్మె నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర జేఏసీ కమిటీ సభ్యులు కారోబార్, బిల్ కలెక్టర్ సంఘం కోశాధికారి యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం డి ఎల్ పి ఓ సాయిబాబా, ఎంపీడీవో అనంతరావు, ఎంపీఓ ప్రవీణ్ కుమార్ కు సమ్మె నోటీసును అందజేశారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కనీస వేతనం 19000 చెల్లించాలని, కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయ కార్యదర్శిగా నియమించాలని, 8 గంటల పని దినాలను అమలు చేసి వారాంతపు సెలవులు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ను రద్దు చేయాలని, అన్ని కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సమస్య పరిష్కారం అయ్యేవరకు సమ్మె నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిపి కార్మికుల సంఘం మండల అధ్యక్షుడు బండి శ్యామ్, కార్యదర్శి స్వామి, చిన్న నాగభూషణం, వెంకట్, మోహన్, తిరుమలరావు, తదితరులు పాల్గొన్నారు.