నవతెలంగాణ -భీంగల్
మండలంలోని పిప్రి గ్రామంలో ఎల్లమ్మ గుడి వద్ద కల్వర్టు నిర్మాణానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి 2 లక్షల 50 వేల రూపాయల నిధులను మంజూరు చేశారు .అట్టి ప్రోసిడింగ్ కాపీని టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు దొనకంటి నరసయ్య పి పిప్రి గ్రామ సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ,ఎంపీటీసీ అరిగేలా సరితా స్వామి ల చేతుల మీదుగా గౌడ సంఘం సభ్యులకు అందజేశారు .ఇ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు భీమర్తి రాజేశ్వర్, వీడిసి అధ్యక్షుడు అరిగెల జనార్ధన్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు గౌడ సంఘ సభ్యులు పాల్గొన్నారు.