నవతెలంగాణ-మహాదేవపూర్
ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధుల కోసం చేపట్టిన కంటి ఆపరేషన్ల ప్రక్రియ ప్రజల నుండి మంచి ఆదరణ వస్తోంది. దీంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి , మంథని నియోజక వర్గం నుండి సుమారు 260 మందిని తన సొంత ఖర్చులతో బస్సులు ఏర్పాటుచేసి కరీంనగర్ లోని కంటి ఆసుపత్రికి తీసుకువెళ్లి టెస్టులు నిర్వహించారు. కంటి ఆపరేషన్లు చేయించిన ప్రొఫెసర్ జయశంకర్ ఫౌండేషన్ చైర్మన్ అయిలి మారుతి అలాగే వారం రోజులపాటు వారితోనే ఉంటూ వారి బాగోగులు చూసుకుంటూ వారికి పాలు బ్రెడ్, పండ్లు, ఆహారం అందజేస్తున్నారు. చైర్మన్ అయిలి మారుతీ మాట్లాడుతూ ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఫౌండేషన్ సభ్యులు బల్ల శ్రావణ్, చింతకింది రాజు, బల్ల సంతోష్,నగేష్, రాజు అన్నారు.