నవతెలంగాణ -వనస్థలిపురం
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ నందు హెడ్ కానిస్టేబుల్స్‌గా పని చేస్తున్న పి.శ్రీనివాస్, యం.వేణుగోపాల్, వి.సురేందర్ రెడ్డి, ఎ.యం.ప్రసాద్‌లకు ఏఎస్‌ఐలుగా ప్రమోషన్ వచ్చింది. ఈ మేరకు ఆ నలుగురిని శుక్రవారం వనస్థలిపురం పోలీస్ స్టేషన్ సీఐ జలందర్ రెడ్డి, డీఐ వెంకట్, ఎస్‌ఐలు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సీఐ జలంధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యత యుక్తంగా తమ విధులు నిర్వహిస్తే ఉన్నత శిఖరాల అధిరోహించడం ఎంతో తేలిక అన్నారు. హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నలుగురికి ఏఎస్‌ఐ గా ప్రమోషన్ రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.