అంబేద్కర్ భవన్, స్థలం ను రక్షిస్తూ నిర్మించండి.

నవతెలంగాణ -గోవిందరావుపేట
అంబేద్కర్ భవన్ స్థలమును రక్షిస్తూ నిర్మించాలని అంబేద్కర్ భవన్ మరియు విగ్రహ నిర్మాణ సమితి చైర్మన్ నెమలి నరసయ్య అన్నారు. మండల కేంద్రంలో ఈ మేరకు తాసిల్దార్ అల్లం రాజకుమార్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా నరసయ్య మాట్లాడుతూ కోటగడ్డ గ్రామం లో గత ఎన్నో ఏళ్లుగా అంబేద్కర్ భవన్ ఎస్సీ కమాండ్ హాల్ కు స్థలమును అప్పటి జిల్లా కలెక్టర్ కేటాయిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం గ్రామ అభివృద్ధికి కేటాయించడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలో దళితులపై గిరిజనుల పైన అణిచివేత,అత్యాచారం, మానభంగాలు అత్యధికంగా దేశంలోనే ఎక్కువ జరుగుతున్నాయని స్పష్టంగా సర్వేలు అధికారుల నివేదికలే సాక్ష్యం అని ఇలాంటి సమయంలో అంబేద్కర్ భవన స్థలన్ని ప్రభుత్వం అంబేద్కర్ భవన్ నిర్మాణం చేసి దళితులకు గిరిజనులకు వెనుకబడిన వర్గాలకు సామాజిక న్యాయ జెండాలో విజ్ఞానం కల్పించాల్సిన ప్రభుత్వాలు వారికి ఎన్నో ఏళ్ల నుండి కేటాయించిన స్థలాలను గ్రామ అభివృద్ధి పేరు మీద ఆక్రమించుకోవడం అంటే మళ్ళీ దళిత గిరిజనులను అన్ని రంగాల్లో వవెనకకు నెట్టి వేయడం అనే సూచికమేనని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటగడ్డ గ్రామంలో 20 సంవత్సరాల క్రితమే నుండి రాష్ట్ర ప్రభుత్వ రెవిన్యూ రికార్డులో ఎస్సీ కమ్యూనిటీ హాల్ అని నమోదయి ఉన్నప్పటికీ కూడా అంబేద్కర్ భవన్ నిర్మాణం చేయకుండా కాలయాపన చేసిన ప్రభుత్వాలను ప్రజలు ప్రజాస్వామిక వాదులు మేధావులు గమనించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ భవన్ &  విగ్రహ నిర్మాణ సమితి మండల ఉపాధ్యక్షులు మహాజన సోషలిస్టు పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు కల్లేపల్లి రమేష్  ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పాల్వాయి సాయిబాబు,అంబేద్కర్ భవన్ & విగ్రహ నిర్మాణ సమితి కోటగడ్డ గ్రామ కన్వీనర్ పాల్వాయి పరశురాం,  దేవదానం, ఇంద్రకంటి సతీష్, పాల్వాయి సతీష్ , తదితర ముఖ్య నాయకులు కార్యక్రమంలో పాల్గొనినారు.