టిడిపి రాష్ట్ర మహిళా కార్యదర్శిగా ఉమామహేశ్వరి

నవతెలంగాణ-గోవిందరావుపేట
తెలంగాణ టిడిపి రాష్ట్ర మహిళా కార్యదర్శిగా మండల కేంద్రానికి చెందిన కొమ్మరాజు ఉమామహేశ్వరి ఎంపికయ్యారు. మంగళవారం ఈ సందర్భంగా ఉమామహేశ్వరి మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి పదవి ఇచ్చిన పార్టీ అధినాయకత్వానికి సర్వదా రుణపడి ఉంటానని అన్నారు. కష్టపడి పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకి మహబూబాబాద్ పార్లమెంటు పార్టీ స్థాయి నాయకులు కొండపల్లి రామచంద్రరావుకి తెలంగాణ టిడిపి రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ కి టిడిపి తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యానాల అనంత రెడ్డికి ములుగు నియోజకవర్గ ఇన్చార్జి ఏర్ల వెంకన్నకు మహబూబాబాద్ పార్లమెంటు సమన్వయ కమిటీ సభ్యులు నర్ర శివాజీలకు ఎంపిక సందర్భంగా ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Spread the love