హయత్‌నగర్‌లో వక్ఫ్‌ బోర్డ్‌ భూములు కాపాడండి

– టీపీసీసీ సెక్రటరీ గజ్జి బాస్కర్‌ యాదవ్‌
నవతెలంగాణ-హయత్‌ నగర్‌
హయత్‌ నగర్‌ డివిజన్‌ పరిధిలోని సర్వే నెంబర్‌ 88,89,147,71/1/2 లలో ఉన్న వక్ఫ్‌ బోర్‌ భూములు పూర్తిగా కబ్జాకు గురై అందులో విచ్చల విడిగా నిర్మాణాలు జరుగుతున్నా రెవిన్యూ అధికారులు మామూళ్ల మత్తులో తూగుతూ పట్టించుకోక పోవడం చాలా సిగ్గు చేటని టీపీసీసీ సెక్రటరీ గజ్జి బాస్కర్‌ యాదవ్‌ అన్నారు. సోమవారం రంగారెడ్డి జాయింట్‌ కలెక్టర్‌ తిరుపతి రావుకు ఆయన కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హయత్‌ నగర్‌ లో గల వక్ఫ్‌ బోర్డ్‌ భూమి సర్వే నెంబర్‌ 88.89.147లో గల 3.ఎ 36 గుంటల బోర్డ్‌ భూమిని భూ కబ్జా దారుల చెర నుంచి కాపాడాలని ప్రజావాణిలో పిర్యాదు చేసినట్టు తెలిపారు. స్పందించిన అధికారులు వెంటనే ఇట్టి భూమిని కాపాడ డానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు.