– బోనమెత్తి.. వంటావార్పు
నవతెలంగాణ- విలేకరులు
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 39 రోజులుగా సమ్మె చేస్తున్న ఐకేపీ వీఓఏలు శనివారం పలు రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. బోనాలు చేశారు. సిద్దిపేట జిల్లాలో వివిధ పద్దతిలో ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేశారు. మిరుదొడ్డి మండలంలో వివోఏలు వంటావార్పు చేశారు. దౌల్తాబాద్‌లో వీవోఏలు చెవిలో పువ్వులు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. సీఐటీయూ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య ఆధ్వర్యంలో గజ్వేల్‌లో వీవోఏలు బిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు. సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు అమ్ముల బాల్ నర్సయ్య కొండపాకలో అంబేద్కర్ చౌరస్తాలో వీవోఏలు బతుకమ్మ ఆడారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో సీఐటీయూ ఆధ్వర్యంలో వీఓఏలు బోనమెత్తి నిరసన తెలిపారు.