ఆశాల సమస్యలను పరిష్కరించాలని నిరసన

నవతెలంగాణ – నసురుల్లాబాద్
ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం బీర్కూర్ స్థానిక ప్రభుత్వ వైద్యశాల వద్ద ఆశా వర్కర్లు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ల యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు గౌరవ వేతనం రూ. 20 వేలకు పెంచాలని, సంక్షేమ పథకాలు, రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు వారు వైద్యాధికారి డాక్టర్‌ అఖిల కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండల ఆశా వర్కర్లు పాల్గొన్నారు.