నవతెలంగాణ – వీణవంక
మండల కేంద్రంలో వివిధ కారణాలతో మృతి చెందిన తొమ్మిది మంది కుటుంబాలకు వీణవంక సర్పంచ్ నీల కుమారస్వామి పరామర్శించి ఒక్కో కుటుంబానికి రూ.3వేల చొప్పున రూ.27వేల ఆర్థిక సాయం అందజేశారు. పులాల వీరస్వామి, దాసారపు రాయమల్లు, దాసారపు పోచయ్య (స్టాలిన్), దాసారపు రాజ వీరు, దాసారపు లింగమ్మ, రెడ్డిరాజుల రాజయ్య, లోకిని రాజమ్మ, రాచర్ల మొగిలి, చింతల రంజిత్ – రజితలు వేర్వేరు కారణాలతో మృతి చేదారు. కాగా ఆ కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. సర్పంచ్ వెంట బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు తాళ్లపల్లి మహేష్ గౌడ్, వార్డ్ మెంబర్లు నీల లక్ష్మీమొండయ్య, రాయిశెట్టి సరితాసంపత్, రెడ్డిరాజుల బిక్షపతి, మోటం రాజు, కృష్ణ చైతన్య, గొడుగు రాజు, నాయకులు ఓరెం క్రాంతి, ఓరెం శ్రీనివాస్, ఓరెం మధు, లింగయ్య, రెడ్డి రాజుల రవి, రాజేందర్, ఓదెలు తదితరులు ఉన్నారు.