పోచమ్మమైదాన్‌లో సైకో హంగామ – ఇద్దరు వ్యక్తులపై దాడి

నవతెలంగాణ-మట్టెవాడ
వరంగల్‌ నగరం పోచమ్మమైదాన్‌లో సైకో గురు వారం వీరంగం సష్టించాడు. ఒళ్లంతా కాలిన గాయా లతో ఒంటిపైన బట్టలులేకుండా పిచ్చిపట్టిన వాడిలా ప్రవర్తిస్తూ అడ్డొచ్చిన వారిపై దాడికిదిగాడు. రాణి రు ద్రమదేవి విగ్రహానికి పూలమాలలు వేసే ఐరన్‌ స్టాం డ్‌పై నిలబడి వచ్చి పోయేవాళ్లపై రాళ్లు రువ్వుతు నా నాహైరానా చేశాడు. విసిగి వేసారి పోయిన బాటసా రులు 100కు డయల్‌ చేసి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని సైకోని ఆపే ప్రయత్నం చేసినప్పటికీ వారిపై తిరిగబడి కాలు తో తన్నుతు చేతులతో కొట్టడు. కాలిన గాయాలతో ఇ బ్బందిపడుతున్నా సైకొని కిందికి దించే ప్రయత్నంలో సాయం చేద్దామని వెళ్లిన పేయింటింగ్‌ కార్మికులు సాబీర్‌, ఖలీల్‌ను సైకో తోసివేయడంతో కిందపడ్డ వా రికి తలలకుదెబ్బలు తగిలి గాయాలు కాగా కూలీల ను చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. అనంత రం ఐరన్‌స్టాండ్‌ నుండి కింద దూకి పారిపోయే ప్ర యత్నం చేసిన సైకొని గుమిగూడిన ప్రజలు, పోలీసు ల సాయంతో బంధించి ఒళ్లంతా కాలిన గాయాలు ఉండడంతో వరంగల్‌ ఎంజీఎంఆసుపత్రికి తరలిం చారు. కాగా సైకోను ఎందుకు ఇలా చేశావని మంద లించగా పిచ్చిపిచ్చి సైగలు చేస్తూ ఏం మాట్లాడకుం డా తాను మధ్యప్రదేశ్‌ రాష్ట్రం బాలఘట్‌ జిల్లా మండ్ల కి చెందిన సరువన్‌గా చెప్పుకుంటూ 4 రోజుల క్రితం ఇక్కడికి వచ్చానని తన ఒళ్ళు ఎలా కలిందో తనకు తె లియదని చెప్పడం విశేషం.