ప్రజాసమస్యలను బీఆర్‌ఎస్‌ సర్కారు పక్కదారి పట్టిస్తుంది

– మహిళల పట్ల నిర్లక్ష్యం
– రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కృష్ణ పూనియా
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటపు ప్రచారాలతో ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నదని కాంగ్రెస్‌ నేత, రాజస్థాన్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కృష్ణ పూనియా విమ ర్శించారు. మహిళల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న దని చెప్పారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్‌, ఎమ్మెల్యే సీతక్క, కార్పొరేటర్‌ విజయారెడ్డితో కలిసి ఆమె విలేకర్లతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఏం సంతోషంగా ఉన్నారని దశాబ్ది ఉత్సవాలు చేస్తున్నారని ప్రశ్నించారు. పేపర్‌ లీకేజీని పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ ఏం తప్పు చేసిందని బంగాళాఖాతంలో కల పాలని కేసీఆర్‌ అంటున్నారో అర్థం కావడం లేద న్నారు. 2014లో ఏర్పడిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఒక్క మహిళకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పిం చలేదన్నారు. మహిళలపై దాడులు పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చైన్‌ స్నాచింగ్‌, సైబర్‌ దాడులు ఎక్కువయ్యాయని విమర్శించారు. మద్యాన్ని నియంత్రించడంలో సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు మహిళలకు కొత్త పింఛన్లు ఇవ్వలేదని చెప్పారు. కల్యాణలక్ష్మి పథకంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే లు కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటై కాంగ్రెస్‌ అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు. ధరణి పోర్టల్‌ వల్ల రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులను కేసీఆర్‌ క్షేత్ర స్థాయిలో పరిశీలించాలని కోరారు. వీఆర్వో వ్యవస్థను తీసేసి కేసీఆర్‌ రెవెన్యూ వ్యవస్థను భ్రష్టుపట్టించారని సీతక్క విమర్శించారు.క్రీడాకారులను డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ అధ్యక్షులు బ్రిజ్‌భూషణ్‌ ఇబ్బంది పెట్టినా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఒలింపిక్‌ గేమ్స్‌లో పతకాలు గెలిచిన క్రీడాకారులను కేంద్రం గౌరవించడం లేదని చెప్పారు.
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ధరణి రద్దు : మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌
కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని మాజీ ఎంపీ పొన్నం ప్రభా కర్‌ చెప్పారు.ధరణి తెచ్చి పెడుతున్న చిక్కులతో రైతు లు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వడగండ్ల వానతో నష్టపోయిన రైతు లకు రూ.10వేల నష్టపరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్‌ నిర్మల్‌ లో చేసిన వ్యాఖ్యలను కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ నేత కోదండ రెడ్డి ఖండించారు. మద్యం కుంభ కోణంలో కూరుకు పోయిన ఎమ్మెల్సీ కవితను రక్షించేందుకు సీఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని పార్టీ సీనియర్‌ ఉపాధ్యక్షులు జి నిరంజన్‌ ఎద్దేవా చేశారు.
టీపీసీసీ లింగ్విస్టిక్‌ మైనార్టీ విభాగం చైర్మెన్‌గా ప్రేమలత
టీపీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్‌రెడ్డి అను మతిమేరకు కాంగ్రెస్‌ లింగ్విస్టిక్‌ మైనార్టీ విభాగం చైర్మెన్‌గా ప్రేమలత అగర్వాల్‌ను నియమిం చారు. ఈమేరకు సోమవారం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షు లు మహేష్‌కుమార్‌గౌడ్‌ ప్రకటనలో పేర్కొన్నారు.