
ఇటీవల విస్తారంగా కురిసిన వర్షాలకు జంపన్న వాగు వరద వృద్ధికి తీవ్రంగా నష్టపోయిన ఊరటం గ్రామపంచాయతీ పరిధిలోని కొత్తూరులో బుధవారం ప్రజా సేవకులు భూక్యా దేవ్ సింగ్ పర్యటించి పరిశీలించారు. మిస్సయిలైన 45 మంది వరద బాధితులకు దుప్పట్ల ను అందజేశారు. ఈ సందర్భంగా ప్రజా సేవకుడు దేవ్ సింగ్ మాట్లాడుతూ వరదలకు తీవ్రంగా నష్టపోయిన కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అన్నారు. బాధిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా శానిటషన్ నిర్వహించాలన్నారు. ములుగు నియోజకవర్గంలో ఈ వరదల ఉధృతి వలన చనిపోయిన ప్రతి వ్యక్తికి ప్రభుత్వం వెంటనే 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, ఇలాంటి పరిస్థితులు రానున్న కాలంలో పునరావృతం కాకుండా శాశ్వతమైన పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్జల సమ్మక్క, రాణి, చిన్నదుర్గయ్య, పొలెబోయిన సరస్వతి, భూలక్షీ,దేవేందర్, నగ్మ, ఆదిలక్ష్మి, విజయ, అనుష తదితరులు పాల్గొన్నారు.