
ఎమ్మెల్యే సీతక్క పిలుపుతో పబ్లిక్ వాయిస్ ఫోరం వికారాబాద్ సభ్యులు శనివారం మండలంలోని ప్రాజెక్టు నగర్ లోని 80 కుటుంబాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించినట్లు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ తెలిపారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి 10,000/- రూపాయలు నీట మునిగిన ఇండ్లకు 1000/- చొప్పున వరద బాధితులకు అందజేయటం జరిగిందన్నారు. ఒక పక్క భారీ వర్షాలు పడి, వరదల వల్ల ప్రాణాలు, ఇండ్లు, పంట పొలాలు కోల్పోతుంటే, కనీసం రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించకుండా, తక్షణ సహాయక చర్యలు పాటించకుండా, నష్టపోయిన వారికి నష్ట పరిహారం అందించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చోద్యం చూస్తున్నారు అని, లేక మహారాష్ట్ర తిరుగుతున్నారని, అసలు వరదల్లో కోల్పోయిన ప్రాణాలు అంటే లెక్క లేదా అని అన్నారు. వరదల వల్ల నష్టపోయిన బాధిత కుటుంబాలకు, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సీతక్క స్వచ్ఛంద సంస్థల సహాయ, సహకారాలు చేపడుతుంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం, ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తొస్తారెమో అని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సీతక్క ఇప్పటివరకు ములుగు నియోజకవర్గంలో ముంపుకు గురి అయిన ప్రాంతాలను మొత్తం పరిశీలించి, నష్టపోయిన బాధితులకు లక్ష రూపాయల నష్ట పరిహారం, ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించి శాశ్వత పరిష్కారం చూపేట్టలని, వరదల వల్ల పంట పొలాలు కొట్టుకుపోయాయి అని వెంటనే ఎకరానికి 30000/- రూపాయల ఆర్థిక సహాయం అందించాలని, మోటార్లు కొట్టుకుపోయిన వారికి వెంటనే మోటార్లు కొనిచ్చి ఆదుకోవాలని సీతక్క గారు అసెంబ్లీ సమావేశాల్లో అధికార పార్టీని డిమాండ్ చేశారు. వరదల వల్ల నష్టపోతున్న ప్రతి ఒక్కరికీ వచ్చే ఏడాది వరకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. వరదల్లో చిక్కుకుని చనిపోయిన మృతుల కుటుంబాలకు 25లక్షల ఎక్స్ గ్రేసియా ప్రకటించి వారిని ఆదుకోవాలని అన్నారు. ప్రజల ప్రాణాలు లెక్కలేని ప్రభుత్వం ఉంటే ఎంత? పోతే ఎంత అని ఎద్దేవా చేశారు. వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని ఇండ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ నగర్ సర్పంచ్ సనప సమ్మయ్య , యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవిచందర్, మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు వంగ రవియాదవ్, ఎస్.సి. సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్, మండల ఇంఛార్జి కొంపెల్లి శ్రీనివాస్ రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రసపుత్ సీతారాంనాయక్, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు పెండెం శ్రీకాంత్, బీసీ సెల్ మండల అధ్యక్షులు పౌడాల ఓం ప్రకాష్, గుండేబోయిన రమేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చింత క్రాంతి మరియు పబ్లిక్ వాయిస్ ఫోరమ్ సభ్యులు అధ్యక్షుడు అశోక్, ఉపాధ్యక్షుడు వేణు, ఉపాధ్యక్షుడు శేఖర్, కోశాధికారి అరుణ్, పట్టణ అధ్యక్షుడు శ్రావణ్‌కుమార్, రాజు, నర్సింహులు, తేజ, యాదగిరి తదితర నాయకులు పాల్గొన్నారు.