ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం : కడియం

నవతెలంగాణ-ధర్మసాగర్‌
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ముందుకు సాగుతున్నారని బిఆర్‌ఎస్‌ స్టేషన్‌ ఘన్పూర్‌ నియోజకవర్గ బిఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం మండలంలో ని జానకిపురం, ఖ్యాతంపల్లి, కేశవనగర్‌ గ్రామాల్లో ఆ పార్టీ ముఖ్య కార్యక ర్తల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ దేశంలో ఏ రాష్ట్రంలో అమలుకాని సంక్షేమ పథకాలు మన రాష్ట్రంలో అ మలవుతున్నాయన్నారు. కార్యకర్తలు రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ ఫలా లను గడపగడపకు చేరవేసి, ప్రజలకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ పరిపాలన విధా నాలను వివరించాలన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం,నియోజకవర్గ అభి వృద్ధి విషయంలో ఎంతో చిత్తశుద్ది,అంకిత భావం కలిగిన నాకు మరోసారి అ వకాశాన్ని కల్పించేలా ప్రతీకార్యకర్త పనిచేయాలని సూచించారు. రాష్ట్రం అభివద్ధి చెందాలంటే కేవలం బిఆర్‌ఎస్‌తోనే సాధ్యమని ఈ విషయాన్ని ప్రజలందరూ గుర్తించుకొని టిఆర్‌ఎస్‌ పార్టీకే పట్టం కట్టాలని కోరారు.
ఇంటింటా బీఆర్‌ఎస్‌ ప్రచారం…
మండలంలోని అన్ని గ్రామాలలో టిఆర్‌ఎస్‌ పార్టీ కార్యకర్తలు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మండల స్థాయి,గ్రామస్థాయి పార్టీ నాయకులు ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి నాయకత్వాన్ని బలపరిచేందుకు పార్టీ మేనిఫెస్టో, అభివద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ వివరిస్తూ ప్రచారాన్ని నిర్వహించారు. కార్యక్రమాలలో జడ్పిటిసి పిట్టల శ్రీలత, వైసిపి బండారు రవీందర్‌, టిఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షులు సర్పంచ్‌ మునిగెల రాజు,ఆయా గ్రామాల సర్పంచులు కుర్సపల్లి నవ్య, మునిగాల శోభ, ఎర్రబెల్లి శరత్‌, పెసర రమేష్‌, కలకోట అనిల్‌ కుమార్‌, కడియం యువసేన నాయకులు అడిగొప్పుల ప్రవీణ్‌ కుమార్‌, చిలుక విన్ను,బూత్‌ కమిటీ నాయకులు కొలిపాక రమేష్‌, దంతూరి బాలరాజు, చిర్ర రవీందర్‌ గారు,మేకల రవి,ఎండీ.సలీం,గంటే సదయ్య, ముప్పారపు కోటేశ్వర్‌,ఎండీ.సాదిక్‌,సోషల్‌ మీడియా ఇంఛార్జ్‌ ఎండీ.హఫీజ్‌ పాల్గొన్నారు.