కాలభైరవ స్వామి ఆలయంలో బీఆర్ఎస్ నాయకుల పూజలు

నవతెలంగాణ- రామారెడ్డి
మండలంలోని శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో బీఆర్ఎస్ నాయకులు ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు జాజాల సురేందర్ కు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించటం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ దశరథ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రజల కోసం చేపట్టిన సంక్షేమ ఫలాలే సురేందర్ ను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు నారాయణరెడ్డి, రవీందర్రావు, పార్టీ మండల అధ్యక్షులు రవీందర్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.