బ్రిడ్జి నిర్మాణ పనుల్లో నాణ్యత నిబంధనలు పాటించాలి

– చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి
నవతెలంగాణ-శంకర్‌పల్లి
బ్రిడ్జి నిర్మాణ పనులు నాణ్యత నింబంధనలు పాటించాలని చేవెళ్ల పార్లమెంట్‌ సభ్యులు రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం శంకర్పల్లి మండలంలోని మోకిలా టంగుటూరు మధ్యలో జరుగు తున్న బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరితగతిన బ్రిడ్జి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. చేవెళ్ల నియోజకవర్గం శంకర్‌పల్లి మండలం మోకీలా నుంచి టంగుటూరు గ్రామా నికి వెళ్ళే రోడ్డులో నూతనంగా నిర్మిస్తున్న బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులో తీసుకు రావాలని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గోవిందమ్మ గోపాల్‌రెడ్డి, శంకర్‌పల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ సాత విజయలక్ష్మి ప్రవీణ్‌ కుమార్‌, బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కె.గోపాల్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పాపారావు, టంగుటూరు సీనియర్‌ నాయకులు ప్రభాకర్‌ రెడ్డి, సర్పంచ్‌ గోపాల్‌ , వెంకటరావు, గ్రామస్తులు పాల్గొన్నారు.