రాహుల్‌ గాంధీ ప్రియాంకలే పోటీ..

– 20 ఏళ్ల రాజకీయ జీవితంలో సీతక్క చేసింది ఏంటి?
– ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి
నవతెలంగాణ – ములుగు
ములుగు నియోజక వర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసేది ధనసరి అన సూయ కాదని, ప్రియాంక, రాహుల్‌ గాంధీలే నని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బడే నాగజ్యోతి అన్నారు. ఒక ఆదివాసీ బిడ్డ ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంటే ఓర్వలేక ఢిల్లీ నుంచి ప్రియాంక, రాహుల్‌ గాంధీలను పిలిపించి మరీ సీతక్క సభ పెట్టించిందని అన్నారు. ఛత్తీస్‌ఘడ్‌లో వేల కోట్లు దోచుకుని వాటిని తెలంగాణలోని 30 నియోజకవర్గాలకు డబ్బు సంచులను పంపిణీ చేస్తోందని అన్నారు. ఆమె నిజమైన ఆదివాసి బిడ్డ కాదని, గిరిజన దొరసాని అన్నారు. మంగళ వారం పొట్లాపూర్‌ పత్తిపల్లి, చింతకుంట, చింతలపల్లి, చిన్న గుంటూరు పల్లి, కోడిశాల కుంట తదితర గ్రామాల్లో ప్రచారం నిర్వహించి ఆమె మాట్లా డారు. 20 ఏళ్లు అధికారంలో ఉన్న ఆమె ములుగు ప్రజలకు చేసింది ఏంటని ప్రశ్నించారు. వేల కోట్లు సంపాదించి నియోజకవర్గంలో వెదజల్లుతుందని ఆరోపించారు. రైతుల కు 24 గంటల కరెంటు ఇస్తుంటే అనసూయ మాత్రం రైతులకు ఉచిత కరెంటు ఎందుకని మాట్లాడుతున్నారని అ న్నారు. మరోసారి కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే ప్రజలు ఇబ్బం దులు కొని తెచ్చుకున్నట్టేనని అన్నారు. మూడోసారి ప్రభుత్వం అధి కారంలోకి రాగానే అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇచ్చే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేనిఫెస్టోలో పొందుపరిచి నట్లు వెల్లడించారు. పొట్లాపూర్‌ గ్రామంలో అన్ని వీధులకు సీసీ రోడ్లు వేయడంతో పాటు గోదావరి నీళ్లతో ఈ ప్రాంత భూ ములు సస్యశ్యామలమయ్యేలా కృషి చేస్తానని అన్నారు. టీఎస్‌ రెడ్‌కో చైర్మన్‌, ములుగు ఎన్నికల ఇన్‌చార్జి ఏరువ సతీష్‌రెడ్డి మాట్లాడుతూ… ఉచిత కరెంటు వద్దంటున్న కాంగ్రె స్‌ పార్టీని రైతులు తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. రైతులను చులకనగా చూసే కాంగ్రెస్‌ పార్టీకి ఓటు ఎందుకు వేయాలని ప్రశ్నించారు. రామప్ప పాకాల నుండి వచ్చే నీటిని పొట్లాపూర్‌ గ్రామానికి మళ్ళించి ఈ ప్రాంత భూములు సస్యశ్యామలం అయ్యేందుకు తన వంతు కషి చేస్తానని అన్నారు. పొ ట్లాపూర్‌, పత్తిపల్లి గ్రామాల్లో పక్కా ఇల్లు, ప్రతి వీధికి సిసి రోడ్డు వేయించే విధంగా బాధ్యతలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. లతా అంకిరెడ్డి, ఎంపీటీసీ మహేష్‌ నాయక్‌, దివం గత మంత్రి చందూలాల్‌ తనయుడు ధరమ్‌సింగ్‌, సీనియర్‌ నేతలు నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గొత్తికోయలకు ఆశ్రయం ఇచ్చింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో గొత్తికోయలకు ఆశ్రయం ఇచ్చిన ఘనత తెలం గాణ ప్రభుత్వానికి దక్కుతుందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బడె నాగజ్యోతి అన్నారు. మంగళవారం జిల్లా కేం ద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు ఆధ్వ ర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో బడే నాగ జ్యోతి మాట్లాడారు. ధనసరి అనసూయ సొంతలేని విధం గా మాట్లాడుతూ నియోజక వర్గ ప్రజలను అయోమ యానికి గురిచేస్తుందని అన్నారు. ఛత్తీస్‌ఘడ్‌లో చేసిన అనుచిత కా ర్యకలాపాల మూలంగా అక్కడి మావోయిస్టులు ఆమె వా హనాలను తగలబెట్టారని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ కార్యక ర్తల మనోజావాలను దెబ్బతీసే విధంగా అనసూయ మాట్లా డితే సహించేది లేదన్నారు. గతంలో పోడు రైతులకు బుల్లెట్ల వర్షం కురిపించిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని, తమ పార్టీకి మద్యం ఇచ్చి ప్రలోబపెట్టి సాంస్కృతి లేదని అన్నారు. స్వచ్చం దంగా ప్రజలు తనకు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. మంత్రి సత్యవతి రాథోడ్‌పై అనుచిత వ్యాఖ్యలు చే యడం సీతక్కకు సరికాదని అన్నారు. కేసీఆర్‌ మద్దతుతో ములుగు ప్రజల ముందుకు వచ్చిన తనకును గెలిపించాలని అభ్యర్ధించారు. ములుగు గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ పూరిక గోవింద్‌ నాయక్‌, తాటి కృష్ణ, కొమురం ధనలక్ష్మి, పార్టీ ములుగు మండల పార్టీ అధ్యక్షుడు వాదం ప్రవీణ్‌, పట్టణ అధ్యక్షుడు చెన్న విజరు, జిల్లా నాయకులు విష్ణు ,ఆరెందుల కుమార్‌, విజయరాం నాయర్‌ తదితరులు పాల్గొన్నారు.