– బిలాస్‌పూర్ నుంచి రారుపూర్‌కు..
– స్లీపర్ కోచ్‌లో ప్రయాణీకులతో మాటామంతి
రారుపూర్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ జనం మధ్యలో తిరుగుతున్నారు. ప్రజాసమస్యలు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం రైలులో ప్రయాణించారు. బిలాస్‌పూర్ నుంచి రారుపూర్ వరకు 117 కిలోమీటర్లు ఆయన ప్రయాణీకులతో వారి సమస్యలపై మాట్లాడారు. రైలులో ఉన్న మహిళా హాకీ క్రీడాకారులతో రాహుల్ మాట్లాడారు. అలాగే వారి శిక్షణ, వారికి అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు.బిలాస్‌పూర్‌లో జరిగిన కాంగ్రెస్ నివాస సమావేశానికి హాజరైన తర్వాత రాహుల్ బిలాస్‌పూర్ నుంచి ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌లోని స్లీపర్ కోచ్ ఎక్కారు. వారు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో రారుపూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో రైలులో సీఎం భూపేష్ బఘేల్, ఇన్‌చార్జి కుమారి సెల్జా కూడా ఉన్నారు. రాహుల్ సాధారణ ప్రయాణీకుడిలా రైలులో ప్రయాణించి అక్కడక్కడా తిరుగుతూ ప్రజలను కలుసుకుని వారి సమస్యలనడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు చాక్లెట్లు, చిప్స్ కూడా కొనుగోలు చేశారు. రారుపూర్ నుంచి బిలాస్‌పూర్ వరకు రాహుల్ గాంధీ ప్రయాణాన్ని కూడా రైలు లోనే నిర్ణయించారు. కానీ రైలు ఆలస్యం కారణంగా ప్రయాణం వాయిదా పడింది.రైలులో కూర్చున్న కొందరు విద్యార్థులతో కూడా రాహుల్ మాట్లాడారు. చదువు, కెరీర్ సమస్యల గురించి వారి నుంచి తెలుసుకున్నారు.
క్రీడాకారుల సమస్యలు వింటూ..
రైలులో రాహుల్ గాంధీని కలిసిన హాకీ ఆటగాళ్లతో మాట్లాడుతూ.. మీరు ఏ ఆట ఆడతారు? నేను హాకీ ఆడతాను అని ప్లేయర్ చెప్పాడు. అయితే ఆమె ఏ స్థానంలో ఆడతారని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. నేను సెంట్రల్ పొజిషన్లో ఆడతాను.అని వివరించారు. రైల్లో ఉన్న ప్రయాణికులు రాహుల్ గాంధీతో ఫొటోలు దిగారు.విద్యార్థులతో చర్చ సందర్భంగా ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు. నేత అంటే ఇలా ఉండాలంటూ పలువురు ప్రయాణీకులు చెప్పుకున్నారు.