బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా రాజగోపాల్‌రెడ్డి

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్‌ అపాయింట్‌మెంట్‌ లెటర్‌ను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి, ఇన్‌చార్జీలు తరుణ్‌చుగ్‌లకు పంపారు. ఆయన నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని అందులో పేర్కొన్నారు. ఆయన కాంగ్రెస్‌ గూటికి చేరకుండా ఆపడంలో భాగంగానే జాతీయ నాయకత్వం ఈ పదవిని ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. అయినా, కోమటిరెడ్డి ఆ పార్టీని వీడబోతున్నారని తెలుస్తున్నది. త్వరలో రాష్ట్రంలో రాహుల్‌ గాంధీతోగానీ, ప్రియాంకగాంధీతోగానీ భారీ బహిరంగ సభ పెట్టించి ఆ వేదిక మీదుగా రాజగోపాల్‌రెడ్డి హస్తం పార్టీలో చేరబోతున్నారని మునుగోడు నియోజకవర్గంలో జోరుగా ప్రచారం జరుగుతున్నది.