11న ‘దశాబ్ది’ సాహిత్య దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈనెల 11న తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మెన్‌ జూలూరు గౌరీశంకర్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కవులు, రచయితలు పోషించారన్నారు. పట్టణ, గ్రామీణ ప్రగతిని ప్రపంచానికి చాటిచెబుతూ కవితలు, పద్యాలు రాసి రాష్ట్రవ్యాప్తంగా కవి సమ్మేళనాలను నిర్వహించుకుంటున్నామన్నారు. 33 జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కవిసమ్మేళనాలు జరుగుతాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కవులు రాసిన కవితలు, పద్యాలను దశాబ్ది ఉత్సవాలకు గుర్తుగా తెలంగాణ సాహిత్య అకాడమీ సంకలనంగా తీసుకువస్తుందన్నారు.

Spread the love