కలుషిత ఆహారం తిని…

– వనపర్తి జిల్లాలో కేజీబీవీ విద్యార్థినులకు అస్వస్థత
– ఎమ్మెల్యే,జిల్లా అధికారుల సందర్శన
– విద్యార్థి,ప్రజాసంఘాల ఆధ్వర్యంలోధర్నా
– కేజీబీవీ విద్యార్థినులకు అస్వస్థత
– ఎమ్మెల్యే, జిల్లా అధికారుల సందర్శన
– విద్యార్థి, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ -ఆత్మకూర్‌
ఆహారం కలుషితమై కేజీకేజీబీవీ విద్యార్థిబీవీ విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన వనపర్తి జిల్లా అమరచింత మండలం పాంరెడ్డిపల్లి గ్రామ సమీపంలో గల కస్తూర్భా గాంధీ బాలికల విద్యాల యంలో శుక్రవారం జరిగింది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో మొత్తం 270 మంది విద్యార్థినులు విద్యను అభ్యసిస్తున్నారు. గురువారం రాత్రి వంకా య, సాంబారుతో భోజనం చేశారు.
అయితే, తెల్ల వారుజామున విద్యార్థినులకు కడుపునొప్పితో పాటు విరేచనాలు అయ్యాయి. అక్కడి సిబ్బందికి చెబితే ఏమీ కాదని పట్టించుకోలేదు. ఉదయం 40 మంది విద్యార్థినులు కడుపునొప్పి, విరేచనాలతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. దాంతో సమీపంలోని అమరచింత ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్‌ అక్షరు కుమార్‌, సాజిదాబేగం, సిబ్బంది చికిత్స అందించా రు. విద్యార్థినుల్లో 8 మందిని మెరుగైన వైద్యం కోసం వనపర్తి జిల్లా ఆస్పత్రికి అంబులెన్స్‌లో తరలించారు.
అధికారుల సందర్శన
ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను జిల్లా వైద్యఆరోగ్య శాఖ అడిషనల్‌ అధికారి శ్రీనివాసులు, అమరచింత తహ సీల్దార్‌ షేక్‌ చాంద్‌ పాషా, ఆత్మకూర్‌ తహసీల్దార్‌ సింధుజ, మండల విద్యాధికారి భాస్కర్‌సింగ్‌ పరామ ర్శించారు. వైద్య సేవలపై డాక్టర్లతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యఆరోగ్య శాఖ అధికారి శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ.. ఆహారం కలుషితమవ్వడం వల్ల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని, ప్రమాదమేమీ లేదని చెప్పారు. మధ్యాహ్నం బాలికలను తిరిగి హాస్టల్‌కు పంపిం చారు. కేజీబీవీలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థినులకు వైద్య పరీక్షలు చేశారు.
విద్యార్థినులను పరామర్శించిన ఎమ్మెల్యే
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి లో విద్యార్థినులను పరామర్శించారు. మెరుగైన చికి త్స అందించాలని వైద్యులకు సూచించారు. అనంత రం అమరచింత సమీపంలో గల కేజీబీవీ విద్యాల యాన్ని సందర్శించారు. ఉన్నతాధికారులతో పూర్తి స్థాయి విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు.
విద్యార్థి సంఘాల ధర్నా
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినుల అస్వస్థతపై విద్యార్థి సంఘాల నాయ కులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మకూరు పట్టణం లోని గాంధీచౌక్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సరైన ఆహారం, పరిశుభ్రత పాటించకపోవడం.. అధికారుల పర్యవేక్షణ లోపించడం వల్లే ఇలా జరిగిందని అన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిపై తగు చర్యలు తీసుకోవా లని డిమాండ్‌ చేశారు. అనంతరం కేజీబీవీ పాఠశా లను సందర్శించి ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి సమస్యలు పరిష్కరించాలని వినతిపత్రం ఇచ్చారు. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు టి.రాఘవేంద్ర, పీడీఎస్‌ యూ జిల్లా సహా కార్యదర్శి వెంకటేష్‌, ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి కుతుబ్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహకార దర్శి రాఘవ, సీపీఐ(ఎం) ఆత్మకూరు మండల కార్యదర్శి శ్రీహరి పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ నాయకులు ప్రశాంత్‌ కుమార్‌ రెడ్డి మద్దతు పలికారు.

Spread the love