ఎమ్మెల్యే పదవికి రాజయ్య రాజీనామా చేయాలి

–  మహిళా కాంగ్రెస్‌రాష్ట్ర కో ఆర్డినేటర్‌ నీలం పద్మ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌
మహిళా సర్పంచ్‌ పట్ల అనుచితగా ప్రవర్తించిన ఎమ్మెల్యే రాజయ్య తన పదవికి రాజీనామా చేయాలని మహిళా కాంగ్రెస్‌ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ నీలం పద్మ డిమాండ్‌ చేశారు. శనివారం ఈమేరకు హైదరాబాద్‌లో గాంధీభవన్‌ వద్ద రాజయ్య దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈసందర్భంగా పద్మ మాట్లాడుతూ జనగామా జిల్లా ధర్మసాగర్‌ మండలంలోని జానకిపురం సర్పంచ్‌ కురసపెల్లి నవ్యను లైంగికంగా వేధించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పదవి నుంచి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బర్తరఫ్‌ చేసి, ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్సీ కవిత, మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు నవ్యకు క్షమాపణ చెప్పాలని కోరారు. కార్య క్రమంలో సికింద్రాబాద్‌ అధ్యక్షులు పుస్తకాల కవిత, నాయకులు సుభాషిణి, సంగీత, రమాదేవి, జిలాని, భాగ్యలక్ష్మి, రోజి, స్వరూప తదితరులు పాల్గొన్నారు.