నవతెలంగాణ-రాజేంద్రనగర్
మధుబన్ కాలనీలో ఉన్న ప్రధాన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. సోమవారం స్థానిక సమస్యల మీద జీహెచ్‌ఎంసీ, జలమండలి అధికారులతో కలిసి మధుబన్ కాలనీలో ఎమ్మెల్యే విస్తతంగా పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలు ఆయన దష్టికి తీసుకొని వచ్చారు. ముఖ్యంగా కాలనీలో డ్రయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని మురుగునీరు మొత్తం రోడ్లపై ప్రవహిస్తున్నాయని స్థానికులు ఎమ్మెల్యేకు తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత చాలా తీవ్రంగా ఉందని స్థానికులు ఎమ్మెల్యే దష్టికి తెచ్చారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో కాలనీలో అప్పటి జనాభాకు అనుగుణంగా డ్రయినేజీ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రస్తుతం జనాభా పెరగడంతో పైప్ లైన్ వ్యవస్థను పూర్తిగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మురుగనీటి సమస్య పరిష్కారానికై నూతనంగా పెద్ద పైప్ లైన్ ఏర్పాటు చేయాలని ఆయన జీహెచ్‌ఎంసి అధికారులను ఆదేశించారు. అధికారులు నిత్యం బస్తీలలో పర్యటించి ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆయన అన్నారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంది ఈ సమస్యను విద్యాశాఖ అధికారి దష్టికి తీసుకొని వెళ్లి వెంటనే ఉపాధ్యాయులను ఏర్పాటు చేయడానికి కషి చేస్తానని ఆయన అన్నారు. అనంతరం పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ సర్కిల్ ఉప కమిషనర్ జగన్, ఈ ఈ నాగేందర్ గౌడ్, టౌన్ ప్లానింగ్ ఏసిపి కష్ణ మోహన్, స్థానిక నాయకులు యాదగిరి, వెంకటేష్, ఎల్లప్ప, అర్జున్, నరేందర్ పాల్గొన్నారు.