నవతెలంగాణ- సిరిసిల్ల
సిరిసిల్లలోని గణేష్ నగర్ అంగన్వాడి కేంద్రంలో రాఖీ పండుగ మంగళవారం ఘనంగా జరిగింది పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్నారులకు కూరగాయల విత్తనాలతో రాఖీలు తయారు చేయించి వారికి కట్టించడం జరిగింది. తర్వాత వాటి విత్తనాలను నాటించాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ వింధ్యారాణి తుక్కారావు పల్లె అంగన్వాడి టీచర్ శిరీష ఆయా వరలక్ష్మి చిన్నారులు తల్లులు పాల్గొన్నారు.