నవ తెలంగాణ-గజ్వేల్
సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో గురువారం అమరవీరుల కుటుంబాలు ర్యాలీ నిర్వహించారు. 1969 నుంచి 2014 వరకు తెలంగాణ రాష్ట్ర సాధనలో అనేకమంది అమరులైనట్టు అమరవీరుల కుటుంబాల సాధన సమితి నాయకులు రఘురాం రెడ్డి అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక, తెలంగాణ దళిత సంఘాల జేఏసీ, తెలంగాణ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎందరో త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో ఉద్యోగాలు రాక ఆత్మ బలిదానాలు చేసుకుంటున్నారని వాపోయారు. కార్యక్రమంలో నిరుద్యోగ యువత, తల్లిదండ్రులు యాత్రలో పాల్గొన్నారు.