నవతెలంగాణ-బంజారాహిల్స్
నిమ్స్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల 17వ తేదీ నుంచి కార్మికులు పోరాటం చేస్తున్నా పట్టించుకోకపోవడంతో హామీల అమలులో నిమ్స్ యాజమాన్యం మొండి వైఖరికి నిరసనగా నల్ల జెండాలు, బ్యాడ్జీలతో నేడు మధ్యాహ్నం 2 గంటల నుంచి నిమ్స్ హాస్పిటల్‌లోని ఆంధ్రా బ్యాంక్ నుంచి ర్యాలీ నిర్వహించనున్నట్టు యూనియన్ (సీఐటీయూ) నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి అతిథిగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ హాజరుకానున్నట్టు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.బాలయ్య తెలిపారు.