పిఏసిఎస్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన…రామారావు.?

– తమకు ఎలాంటి ఆర్డర్స్ రాలేదంటున్న సహకార అధికారులు.
– నవ తెలంగాణ మల్హర్ రావు.
మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము మళ్ళీ రచ్చకెక్కింది.గత ఐదారు సంవత్సరాలుగా వివాదంలో కొనసాగడం ఈ సొసైటీకి పరిపాటిగా మారింది.
జరిగింది ఇలా…
తాడిచెర్ల పిఏసిఎస్ సొసైటీకి ఫిబ్రవరి 2019లో ఎన్నికలు జరిగాయి..5-3-2019న చేప్యాల రామారావు చైర్మన్ గా,వైస్ ఛైర్మన్ గా మల్కా ప్రకాష్ రావు లతోపాటు 13 మంది డైరెక్టర్లు పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు.సరిగ్గా రెండు సంవత్సరాల తరువాత అవినీతి ఆరోపణలపై చైర్మన్ రామారావును భూపాలపల్లి జిల్లా డిసిఓ కార్యాలయం అధికారులు 20-20-2022న సస్పెన్షన్ చేశారు.తరువాత వైస్ ఛైర్మన్ గా ఉన్న ప్రకాష్ రావు ను అధికారులు 18-11-2022న ఇంచార్జి చైర్మన్ గా బాద్యతలు అప్పగించారు.అప్పటి నుంచి ప్రకాష్ రావు చైర్మన్ గా కొనసాగుతున్నారు. మాజీ ఛైర్మన్ కొద్దీ నెలల క్రితం కోర్టుకు ఆశ్రయించిన నేపథ్యంలో ఈ నెల 16న హైకోర్టు స్తే ఆర్డర్ ఇచ్చినట్లుగా తెలిపారు.తిరిగి రామారావు చైర్మన్ గా చైర్మన్ గా బుధవారం బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు తాను ఎలాంటి తప్పులు,అక్రమాలు చేయలేదని కొందరు కావాలనే ఇలా చేసినట్లుగా ఆరోపించారు.ఈ నెల 16న హైకోర్టులో స్టే ఆర్డర్ వచ్చినట్లుగా మండల సిఈఓ, భూపాలపల్లి డిసిఓ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు.బుధవారం తాను కోర్టు ఆర్డర్ ప్రకారం చైర్మన్ గా బాధ్యతలు చేపట్టినట్లుగా వివరించారు.
మాకు ఎలాంటి ఆర్డర్స్ రాలేదు….డిసిఓ భూపాలపల్లి
తాడిచెర్ల పిఏసిఎస్ కార్యాలయానికి సంబంధించిన, మాజీ ఛైర్మన్ రామారావు కు సంబంధించిన తమకు కోర్టు నుంచి కానీ, తమ శాఖ నుంచి కానీ, ఎలాంటి ఆదేశాలు, ఉత్తర్వులు రాలేదని భూపాలపల్లి డిసిఓ మరియు తాడిచెర్ల పిఏసిఎస్ సిఈఓ లు నవ తెలంగాణ తో చెప్పారు. సమాచారం లేకుండా చైర్మన్ కుర్చీలో కూర్చోవడం సరికాదన్నారు.
దొరననే ఆహకారంతోనే కుర్చీలో కూర్చున్నాడు: తాడిచెర్ల పిఏసిఎస్ ఇంచార్జి చైర్మన్ ప్రకాష్ రావు
దొరననే అహంకారంతోనే మాజీ పిఏసిఎస్ చైర్మన్ చెప్యాల రామారావు రాజ్యాంగ మరియు చట్ట బద్దంగా కాకుండా, భూపాలపల్లి డిసిఓ, తాడిచెర్ల పిఏసిఎస్ సిఈఓ ల ఆదేశాలు,సమాచారం లేకుండానే దౌర్జన్యంగా ఒక పనికి రాని లెటర్ చూపిస్తూ చైర్మన్ కుర్చీలో కూర్చొవడం సిగ్గుచేటని ప్రస్తుత పిఏసిఎస్ ఇంచార్జి చైర్మన్ మల్కా ప్రకాష్ రావు ఆరోపించారు. బుధవారం పిఏసిఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అక్రమ అవినీతి ఆరోపణలో సస్పెన్షన్ అయిన రామారావు కోర్టు స్టే అంటూ పనికిరాని లెటర్ చూపిస్తూ హల్చల్ చేయడం సరికాదన్నారు.ఒకవేళ కోర్టు స్టే అయితే సంబంధించిన అధికారులకు రాదని ప్రశ్నించారు. సొసైటీకి సంబంధించిన ఉన్నతాధికారులు ఆదేశాలు లేకుండా దర్జాగా చైర్మన్ కుర్చీలో ఎలా కూర్చుంటాడో చెప్పాలన్నారు.ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా,దౌర్జన్యం చేస్తున్న అతనిపై పోలీసులకు,సంబంధించిన అధికారులకు ఫిర్యాదు చెస్తానన్నారు.గతంలో ఇలాగే అవినీతి, అక్రమాలు చేయంతోనే అధికారులు సస్పెన్షన్ చేసినట్లుగా తెలిపారు. అనుమతులు లేనిది కార్యాలయంలో లోకి ఎవరిని రానీవొద్దని సిబ్బందిని ఆదేశించారు.చట్టాలకు విరుద్ధంగా వెళ్ళితే తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు.