నవతెలంగాణ-యైటింక్లైన్ కాలనీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమకారుడైన కోరుకంటి చందర్ కే రామగుండం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం సంతోషకరమని 18వ డివిజన్ కార్పొరేటర్ బాదె అంజలిదేవి ఒక ప్రకటనలో తెలిపారు. రామగుండం అభివృద్ధి పథంలో నడిపిస్తూ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్న అవిశ్రాంత శ్రామికుడు కోరుకంటి చందర్ కి టిక్కెట్ ఇవ్వడం ఒక ఉద్యమకారుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నామని ఆమె అన్నారు. ఈ సందర్భంగా 18వ డివిజన్ అల్లూరులో బాణాసంచాలు కాల్చుతు సంబరాలు జరుపుకున్నారు.