కాంగ్రెస్ పై ప్రజలల్లో సంపూర్ణ విశ్వాసం: రమేష్ చంద్ర రాథోడ్

నవతెలంగాణ- బెట్టేలా తండా: కాంగ్రెస్ పై ప్రజలకు సంపూర్ణ విశ్వాసం ఉందని జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు రమేష్ చంద్ర రాథోడ్ అన్నారు. శుక్రవారంనాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం బెట్టేలా తండాలో జయవీర్ గెలువు కోసం ఆరు గ్యారెంటీల పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చల్లా మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసిన సోనియమ్మ తెలంగాణ రాష్ట్ర ప్రజల బతుకులు మార్చేందుకు ఆరు గ్యారెంటీలను ప్రకటించారని అవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి అని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీలపై ప్రజల్లో కాంగ్రెస్ పట్ల పూర్తి విశ్వాసం కలిగిందని కాంగ్రెస్ ను అధికారంలోకి రావడం ఖాయం అని అన్నారు. సాగర్లో జయవీర్ అత్యధిక మెజార్టీ రావడం ఖాయమని తెలిపారు. ఆరు గ్యారంటీలలో బంగారు లక్ష్మి లోబాగంగా వివాహం చేసుకుంటున్న ప్రతి యువతికి లక్ష రూపాయలతో పాటు, తులం బంగారం ఇస్తుందని అన్నారు. రైతులకు ఒకే సారి రెండు లక్షలు రుణ మాఫీ, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంభ మహిళకు నెలకు 2500లు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, యువతకు రెండులక్షల ఉద్యోగాలు, వంటి అనేక పథకాలు అమలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల యువజన నాయకులు రాహుల్ బన్నీ, లాలు, కరంసింగ్, హరి రాము, శ్రీధర్, శివ తదితరులు వున్నారు.