నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ట్విట్టర్ వేదికగా రాజకీయ బాంబులు పేల్చే సినీనటి, బీజేపీ నేత విజయశాంతి ఈ సారి సొంత పార్టీ నేతలపైనే ఎక్కుపెట్టారు. ”చిట్‌చాట్‌ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో పని చేసే కార్యాచరణ తనకు లేదు” అని స్పష్టం చేశారు. ‘పార్టీకి ఏది ముఖ్యమో ఆ అంశాలను ముఖ్యనేతల సమావేశంలో అగ్రనేతలకు స్పష్టంగా చెప్పాను. ఆ విషయాలు బయటకు లీకేజ్‌ల పేరుతో ఇవ్వడానికి నేను వ్యతిరేకిని. కొంతమంది మా పార్టీలోని నేతలు పనిగట్టుకుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బీజేపీకి రాములమ్మ దూరమంటూ నాపై సోషల్ మీడియా ద్వారా చేయిస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నా’ అంటూ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ ట్వీట్ ఈటలకు కౌంటర్‌గానే చేశారని ప్రచారం జరుగుతున్నది.