చౌట్ పల్లి  ఉన్నత పాఠశాలలో రాష్ట్రీయ ఏక్తా  దివాస్

 నవతెలంగాణ కమ్మర్ పల్లి   మండలంలోని చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం సర్దార్ వల్లభాయ్ పటేల్  148వ జయంతిని పురస్కరించుకొని ఏక్తా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ భారతదేశ ఉక్కుమనిషిగా  పేరుపొందిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని 2014 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 31వ తేదీని రాష్ట్రీయ ఏక్తా దివాస్ గా జరుపుకుంటున్నట్లు తెలిపారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో, దేశ సమగ్రత కొరకు కీలక పాత్ర పోషించిన గొప్ప నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. అనంతరం విద్యార్థులతో జాతీయ ఐక్యత ప్రతిజ్ఞను చేయించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు  సాయన్న, సాదుల్లా, త్రిలోచన్ రావు, గీత, గంగాధర్, పీఈటి నవ్య, సిఆర్ పి అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.