
రేషన్ డీలర్లకు కమిషన్ పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కేంద్రంలో మండల రేషన్ డీలర్లు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రేషన్ డీలర్ల కమిషన్ రూ.140కు పెంచడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షుడు ముక్క అంజయ్య, కార్యవర్గ సభ్యులు, ఆయా గ్రామాల రేషన్ డీలర్లు, తదితరులు పాల్గొన్నారు.