తహసీల్దార్ కు రేషన్ డీలర్ల సన్మానం

Ration dealers honor to Tehsildarనవతెలంగాణ- రాయపోల్
దౌల్తాబాద్ మండలానికి నూతనంగా వచ్చిన తహసిల్దార్ చంద్రశేఖర రావును దౌల్తాబాద్ మండల రేషన్ డీలర్లు శుక్రవారం దౌల్తాబాద్ తహసిల్దార్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానం చేసి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దౌల్తాబాద్ మండల రేషన్ డీలరుల సంఘం అధ్యక్షులు ఎ.లక్ష్మణ్, సభ్యులు వి. మల్లేశం, ఎ. శేఖర్ రెడ్డి, సాయిలు, మొగులయ్య, భూషణం, లక్ష్మణ్, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.