నవతెలంగాణ- శంకరపట్నం
రేషన్ డీలర్ల కు కమిషన్ పెంచుతూ జీవో విడుదల చేసిన సందర్భంగా గురువారం శంకరపట్నం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం ముందు ముఖ్యమంత్రి కెసిఆర్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ,మంత్రి, గంగుల కమలాకర్ ల చిత్రపటాలకు రేషన్ డీలర్లు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల్లోని రేషన్ డీలర్లు నాయకులు తదితరులు పాల్గొన్నారు.