
జాతీయ రహదారి 63 మండల తాసిల్దార్ కార్యాలయం వద్ద శనివారం ఉదయం రేషన్ బియ్యం తరలిస్తున్నారు అన్న సమాచారం మేరకు తనిఖీ చేయగా బొలోర వాహనం పట్టుకున్నట్లు ఎస్సై అనిల్ రెడ్డి తెలిపారు. ఒక సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించగా మహారాష్ట్రకు చెందిన MH 26BE 4502 గల బోలోరో వాహనంలో 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుకొని పోలీస్ స్టేషన్కు తరలించినట్లు తెలిపారు. పట్టుకున్న వాహనాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.