నవతెలంగాణ – తంగళ్ళపల్లి
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై రామ్మోహన్ తెలిపారు. తంగళ్ళపల్లి మండలంలోని అంకిరెడ్డి పల్లె గ్రామ శివారులో ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామానికి చెందిన వారణాసి నరేష్ ఇంటింటికి తిరుగుతూ రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి శనివారం ఆటోలో 8 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నాడని సమాచారం మేరకు ఎస్సై సిబ్బందితో వెళ్లి అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. డ్రైవర్ను విచారించగా సిద్దిపేట జిల్లా దుబ్బాక గ్రామానికి చెందిన విభూతి రాజేష్ అనే వ్యక్తికి సేకరించిన బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.