నితీశ్‌ క్యాబినెట్‌లోకి రత్నేష్‌ సదా

పాట్నా : బీహార్‌లో క్యాబినెట్‌లో కీలక మార్పు చోటుచేసుకుంది. ఇటీవల రాజీనామా చేసిన సంతోష్‌ కుమార్‌ సుమన్‌ స్థానంలో జెడి (యు) ఎమ్మెల్యే రత్నేష్‌ సదా శుక్రవారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జెడి (యు)లో విలీనం కావాలనే ఒత్తిడి నేపథ్యంలో తమ పార్టీని కాపాడుకునేందుకంటూ హిందుస్తానీ అవమ్‌ మోర్చా (హెచ్‌ఎఎం)కి చెంచిన మాజీ సీఎం జితమ్‌రామ్‌ మాంజీ కుమారుడు సంతోష్‌కుమార్‌ సుమన్‌ మంత్రి పదవికి ఈ నెల 13న రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రత్నేష్‌ సదా మాట్లాడుతూ హెచ్‌ఎఎం అధ్యక్షుడు జితమ్‌ రామ్‌ మాంజీ, సుమన్‌ దళితులకు, ముసాహర్‌ కమ్యూనిటీకి చేసిందేమీ లేదని అన్నారు.