నవతెలంగాణ- డిచ్ పల్లి: ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారిగా రవి మోహన్ భట్ భాద్యతల స్వికరించారు. ఇప్పటి వరకు రేంజ్ అధికారిణిగా భాద్యతలు చేపట్టిన హిమచందన హైదరాబాద్ లోని అటవీ ప్రధాన కార్యాలయం లో రిపోర్ట్ చేయనున్నారు.శుక్రవారం రేంజ్ కార్యాలయం లో రేంజ్ అధికారిని హిమచందన నుండి రవి మోహన్ భట్ భాద్యతలు స్వికరించారు. రవి మోహన్ భట్ ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లా గాంధారి రేంజ్ అధికారిగా భాద్యతలు చేపట్టి సాదారణ బదిలీ లో భాగంగా ఇందల్ వాయి రేంజ్ అధికారిగా నియామకం పొందారు.అనంతరం రవి మోహన్ భట్ మాట్లాడుతూ రేంజ్ పరిధిలో అటవీ సంరక్షణకు తనవంతు సిబ్బంది తో కలిసి కృషి చేస్తానని, ప్రజలు కుడా అటవీ అధికారులకు సహకరించాలని కోరారు.గతంలో ఇంచార్జీ రేంజ్ అధికారి గా కోన్ని
నేలల పాటు బాద్యతలను నిర్వర్తించారు.ఇందల్ వాయి ఫారెస్ట్ రేంజ్ అధికారి రవి మోహన్ భట్ కు అటవీ శాఖ అధికారులు, కార్యాలయ
సిబ్బంది స్వాగతం పలికారు.హిమచందన శుక్రవారం ఇందల్ వాయి నుండి రిలీవ్ అయ్యారు.