బాలకష్ణ హీరోగా, బి.గోపాల్ దర్శకత్వంలో రూపొందిన సూపర్‌హిట్ చిత్రం ‘నరసింహ నాయుడు’ మరోసారి ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమైంది. బాలకష్ణ పుట్టినరోజు పురస్కరించుకుని నేడు (శనివారం) 4కె వెర్షన్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా మేడికొండ వెంకట మురళీకష్ణ మాట్లాడుతూ, ‘నరసింహ నాయుడు’ హిస్టరీ సృష్టించిన చిత్రం. ఇప్పుడీ చిత్రాన్ని డిజిటలైజ్ చేసి ప్రపంచ వ్యాప్తంగా 750 నుంచి 1000 థియేటర్స్‌లో విడుదల చేయనున్నాం మళ్లీ ఈ చిత్రం ఓ సెన్సేషన్ అవుతుంది’ అని చెప్పారు.
”నరసింహనాయుడు’ నాకెరీర్‌లో మరచిపోలేని చిత్రం. బాలయ్య అద్భుతంగా నటించారు. కథ, పరుచూరి బ్రదర్స్ మాటలు, పాటలు, డాన్స్‌లు, మణిశర్మ సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచాయి’ అని దర్శకుడు బి.గోపాల్ తెలిపారు.